కావలసిన పదార్థాలు :పచ్చిమామిడికాయలు... రెండు కేజీలుటేబుల్ సాల్ట్... 200 గ్రా.కారం... కప్పుఆవపిండి... అర కప్పుపసుపు... రెండు టీ.నువ్వుల నూనె... 5 టీ.తయారీ విధానం :మామిడికాయల్ని శుభ్రంగా కడిగి బాగా తుడిచి ఎండలో పెట్టాలి. కాయల్ని ఓ బేసిన్‌లో వేసి అందులో ఐదారు టీస్పూన్ల నువ్వుల నూనె వేసి బాగా కలిపి పక్కకు ఉంచాలి. మరో పాత్రలో మిగిలిన దినుసులన్నీ వేసి కలిపి ఉంచాలి. మూడో పాత్ర తీసుకుని అందులో కొంచె కారం మిశ్రమం, కొన్ని మామిడికాయలు... ఒకదాని తరువాత ఒకటి చొప్పున వేస్తూ కలపాలి. దీనిమీద మూతపెట్టి బట్టతో కట్టి నాలుగు రోజుల తరువాత తీసి జాడీలో పెట్టాలి. ఈ పచ్చడి చేసేటప్పుడు కొన్ని నీళ్లు ఊరతాయి. వాటిని చూసి కంగారుపడకుండా పచ్చడిని కలియతిప్పితే సరిపోతుంది. |