మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » భారతీయ » ఉత్తరాది వంటకం "పాల పువ్వులు" (Cookery | Indian | Wheat Flour | Maida | Coconut | Milk | Elaichi Powder | Baking Soda | Oil)
 
కావలసిన పదార్థాలు :
గోధుమపిండి.. పావు కేజీ
మైదా.. పావు కేజీ
గోధుమనూక.. 125 గ్రా.
పచ్చికొబ్బరి తరుగు... ఒక కప్పు
కాచిన పాలు.. పావు లీ.
యాలకులపొడి.. ఒక టీ.
వంటసోడా.. పావు టీ.
నూనె.. తగినంత

తయారీ విధానం :
మైదా, గోధుమపిండిలను ఒక పాత్రలో వేసి కలిపి అందులోనే గోధుమ నూక, యాలకులపొడి, పంచదార, కొబ్బరిముక్కలు, తినే సోడా వేసి పాలు పోసి పునుగుల పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి గరిటెతో లేదా చేత్తోనే పిండి తీసుకుని కావలసిన సైజులో నూనెలో వెయ్యాలి. అవి పొంగి ఎర్రగా వేగిన తరువాత చిల్లులగరిటెతో తీయాలి. అంతే పాల పువ్వులు రెడీ..! ఉత్తరాదిలో చేసే ఈ పాల పువ్వులు నాలుగురోజులుదాకా నిల్వ ఉంటాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.