మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » భారతీయ » మలయాళీ చేపల పసందు "మతీ పొరిచాతు" (Cookery | Indian | Mathi Fish | Green Chilli | Garlic | Black Pepper | Ginger | Lemon Juice | Egg | Oil)
Feedback Print Bookmark and Share
 
కావలసిన పదార్థాలు :
మతీ చేప... అర కేజీ
పచ్చిమిర్చి.. మూడు
వెల్లుల్లి.. పది రెమ్మలు
బ్లాక్ పెప్పర్.. ఒక టీ.
అల్లం.. చిన్న ముక్క
నిమ్మరసం.. రెండు టీ.
గుడ్డు.. ఒకటి
నూనె.. తగినంత
ఉప్పు.. సరిపడా

తయారీ విధానం :
ముందుగా మతీ చేపను శుభ్రం చేసుకుని ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, బ్లాక్ పెప్పర్, లెమన్ జ్యూస్, గుడ్డు, ఉప్పులను కలిపి పేస్ట్‌లాగా చేసి.. దాన్ని చేపలకు బాగా పట్టించి అరగంటసేపు నానబెట్టాలి. తరువాత కడాయిలో బాగా కాగుతున్న నూనెలో ఈ చేప ముక్కలను వేసి బంగారు వర్ణం వచ్చేదాకా కాల్చి తీసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. మలయాళీలు చాలా ఇష్టంగా తినే ఈ వంటకం తయారీ కూడా చాలా సులభమే. మరి మీరూ ట్రై చేస్తారు కదూ..?
సంబంధిత సమాచారం కోసం శోధించండి.