మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » భారతీయ » చల్లటి వాతావరణంలో "పుదీనా రైతా" పసందు..! (Indian | Fresh Curd | Honey | Pudina Paste | Green Chili | Onion | Salt | Sugar | Coriander | Mint Leaves)
Feedback Print Bookmark and Share
 
కావలసిన పదార్థాలు :
తాజా పెరుగు.. రెండు కప్పులు
తేనె.. రెండు టీ.
పుదీనా పేస్ట్.. ఒక టీ.
పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు.. కప్పునిండా
ఉప్పు.. తగినంత
పంచదార.. ఒక టీ.
కొత్తిమీర తురుము.. రెండు టీ.
అలంకరణకు.. కాసిన్ని పుదీనా ఆకులు

తయారీ విధానం :
పెరుగును బాగా గిలకొట్టాలి. అందులో పుదీనా ఆకులు తప్ప పైన చెప్పుకున్న పదార్థాలన్నింటినీ వేసి బాగా కలియబెట్టాలి. తీపి ఇంకాస్త ఎక్కువగా కావాలనుకునేవారు మరో టీస్పూన్ పంచదార కలిపితే సరిపోతుంది. ఇక వడ్డించేముందుగా పుదీనా ఆకులతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే రుచికరమైన పుదీనా రైతా తయార్..!

అసలే చల్లటి వాతావరణం.. ఇక సాయంత్రాల్లో వేడి వేడి బిర్యానీ లేదా ఫ్రైడ్‌రైస్ లేదా ఓ కప్పు పుదీనా రైతా ఉంటే పండగే పండుగ. అందుకే ఈ వెరైటీని మీరూ ఓసారి ట్రై చేసి చూడండి మరి...!!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.