మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » భారతీయ » రుచికరమైన చేదులేని "అల్లం కాకర ఊరకాయ" (Indian | Ginger | Bitter Gourd | Tamarind | Salt | Chili Powder | Oil)
Feedback Print Bookmark and Share
 
Bittergourd
FILE
కావలసిన పదార్థాలు :
కాకరకాయలు.. ఒక కేజీ
చింతపండు.. పావు కేజీ
ఉప్పు.. తగినంత
కారం.. సరిపడా
నూనె.. 300 గ్రా.

తయారీ విధానం :
ముందుగా కాకరకాయల్ని శుభ్రంగా కడిగి తుడిచి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన ఉంచాలి. ఒక గిన్నెలో చింతపండు, నీళ్ళు పోసి మెత్తగా ఉడకనివ్వాలి. చల్లారాక చింతపండుతో పాటు చిన్న చిన్నగా తరిగిన అల్లంముక్కల్ని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. బాణలిలో నూనె పోసి కాకరకాయ ముక్కలు వేసి కరకరలాడే వరకు వేయించి పక్కకు తీసేయాలి.

వేయించిన కాకర ముక్కలు, చింతపండు రసం, కారం అన్నింటినీ ఒక పాత్రలో వేసి కలియబెట్టాలి. వేరో కడాయిలో తగినంత నూనె పోసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకులతో తాలింపు పెట్టి కాకర ముక్కల్లో కలపాలి. అంతే అల్లం కాకర ఊరకాయ తయార్..! ఇది బాగా ఆరిన తరువాత బాటిల్‌ లేదా జాడీలలో భద్రపరచుకుంటే చాలా రోజుల వరకూ నిల్వ ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది కూడా..!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.