మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » భారతీయ » పందిరి "దొండ పచ్చడి" భలే రుచి అమ్మడూ... (Indian | Gherkins | Dry Chili | Tamarind | Turmeric | Salt | Urad Dal | Chana Dal | Mustrad | Cumin seeds)
Feedback Print Bookmark and Share
 
Donadakaaya
FILE
కావలసిన పదార్థాలు :
దొండకాయలు... పావు కిలో
ఎండుమిర్చి... 25 గ్రా.
చింతపండు... నిమ్మకాయంత
పసుపు... చిటికెడు
ఉప్పు... సరిపడా
మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ ముక్క... పోపుకు సరిపడా

తయారీ విధానం :
కొంచెం నూనెలో మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేయించి వుంచుకోవాలి. దొండకాయల్ని అడ్డంగా రెండేసి ముక్కలుగా తరిగి రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచిపెట్టుకోవాలి. ఇప్పుడు వేయించిన పప్పులూ, ఎండుమిర్చి, ఇంగువ కలిపి మెత్తగా నూరుకోవాలి. దాంట్లోనే నూరిపెట్టుకున్న దొండకాయల తొక్కును కలిపి మరింత మెత్తగా నూరాలి.

తరువాత పైన చెప్పుకున్న పోపు వస్తువులతో పోపుపెట్టి పచ్చడికి కలపాలి. అంతే దొండకాయపచ్చడి రెడీ. దీన్ని వేడి వేడి అన్నం, నెయ్యిలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. దొండకాయలను కూరగా కూడా వండుతారు. వీటి లేత ఆకులను కూడా కొన్ని ప్రాంతాలలో కూరల్లో కలిపి వండుతుంటారు కూడా..!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.