మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » భారతీయ » పుల్లగా.. కారంగా.. "మామిడి గుత్తివంకాయ కూర" (Indian | Brinjal | Green Mangoes | Green Chilli | Ginger | Cumin Seeds | Garlic | Onion | Curry Leaves)
Feedback Print Bookmark and Share
 
Brinjal Curry
FILE
కావలసిన పదార్థాలు :
వంకాయలు... 250 గ్రా.
పచ్చి మామిడి... ఒకటి
పచ్చిమిర్చి... 30 గ్రా.
అల్లం... చిన్న ముక్క
జీలకర్ర... అర టీ.
వెలుల్లి...10 రేకలు
పసుపు... అర టీ.
కొత్తిమీర... ఒక కట్ట
కరివేపాకు... 2 రెమ్మలు
ఉల్లిపాయ... ఒకటి
ధనియాలు... ఒక టీ.
ఉప్పు... సరిపడా
రిఫైండ్ ఆయిల్... సరిపడా

తయారీ విధానం :
ముందుగా ఉల్లిపాయ, ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చిలను రుబ్బుకొని పేస్ట్‌లాగా చేసుకోవాలి. కడాయిలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, రుబ్బి ఉంచుకున్న పేస్ట్ వేసి సన్నని సెగపై ఉడికించాలి. వంకాయకు నాలుగు వైపులా గాట్లు పెట్టి పేస్ట్‌లో వేసి ఉడకనివ్వాలి.

పసుపు, ఉప్పు, వేసి కొద్ది సేపయ్యాక కప్పు నీళ్ళు పోసి ఉడికించి ఆపై తరిగిన మామిడికాయ వేసి కలపాలి. బాగా ఉడికిన తరువాత కొత్తిమీర, కరివేపాకుతో అలంకరించుకుని దింపేయాలి. ఈ కూర వేడి వేడి అన్నం, చపాతీల్లోకి చాలా బాగుంటుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.