మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » భారతీయ » అల్లం స్లైసులతో వెరైటీ "చికెన్ మస్ట్రడ్ కబాబ్" (Indian | Chicken | Ginger | Curd | Garam Masala | Black Salt | Chili Powder | Ginger | Garlic | Mustrad Oil)
Feedback Print Bookmark and Share
 
Kabab
FILE
కావలసిన పదార్థాలు :
ఎముకలు లేని కోడి మాంసం... అర కేజీ
అల్లం... 50 గ్రా.
గడ్డ పెరుగు... అర కప్పు
గరంమసాలా పొడి... అర టీ.
జీరా పొడి... అర టీ.
కస్తూరి మేతి పొడి... అర టీ.
నల్ల ఉప్పు... అర టీ.
మిర్చిపొడి... ఒక టీ.
అల్లం వెల్లుల్లి ముద్ద... అర టీ.
ఆవనూనె... 20 గ్రా.

తయారీ విధానం :
చికెన్‌ను శుభ్రపర్చి, మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లం కొమ్మును స్లైసులుగా కట్ చేసుకోవాలి. చికెన్ ముక్కలు, అల్లం స్లైసులు, పై మసాలాల మిశ్రమాన్ని కలిపి అరగంటసేపు నానబెట్టాలి.

తరువాత అల్లం ముక్కలు, చికెన్ ముక్కలను వరుసగా సీకుకు గుచ్చి తందూరి లేదా ఓవెన్‌లో 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో 10 నిమిషాలపాటు ఉడికించాలి. అంతే చికెన్ మస్ట్రడ్ కబాబ్ రెడీ. దీన్ని వేడిగా ఉన్నప్పుడే పుదీనా చట్నీతో కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.