మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » భారతీయ » కాలీఫ్లవర్‌ రైస్ విత్ పొటాటోస్ (Indian | Basmati Rice | Oil | Pressure Cooker | Cauliflower | Potatoes | Tablespoon)
Feedback Print Bookmark and Share
 
Rice
FILE
కావలసిన పదార్థాలు :
బాస్మతి బియ్యం... మూడు కప్పలు
కాలీఫ్లవర్‌... ఒకటి
ఆలుగడ్డలు... మూడు
అల్లం-వెల్లుల్లి పేస్ట్... ఒక టీ.
పచ్చిమిర్చి... నాలుగు
నూనె... పావు కప్పు
పసుపు... ఒక టీ.
ఉల్లిపాయలు... మూడు
టమోటాలు... మూడు
ఉప్పు... సరిపడా

తయారీ విధానం :
బాస్మతి బియ్యాన్ని నూనెలో కొద్దిగా వేయించి ప్రెజర్‌ కుక్కర్‌లో ఉడికించాలి. కాలీఫ్లవర్‌ను కూడా ఉడికించాలి. ఆలుగడ్డలను చిన్న ముక్కలు చేసి నూనెలో వేయించాలి. పాన్‌లో నూనె వేసి, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగిన తరువాత అల్లం, వెల్లుల్లి పేస్టును, తరిగిన టమోటాలను కూడా వేసి వేయించాలి.

దీనికి పసుపు పొడి, కారం, పొడి మసాలా, పచ్చి మిర్చి ముక్కలు కూడా వేసి వేయించాలి. సరిపడా ఉప్పు వేసి చివరగా ఉడికించిన కాలీఫ్లవర్‌ వేసి కలపాలి. ఉడికించిన రైస్‌లో ఈ మిశ్రమాన్ని కలపాలి. చివరగా వేయించిన ఆలుగడ్డ ముక్కలు కలుపుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరిగి చల్లి అలంకరించి సర్వ్ చేయాలి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.