మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » భారతీయ » హెల్దీ అండ్ టేస్టీ "టొమోటో హల్వా" (Tomatoes | Sugar | Ghee | Cashew Nuts | Badam Seeds | Bombay Rava | Elaichi Powder)
Bookmark and Share Feedback Print
 
Tomotos
FILE
కావలసిన పదార్థాలు :
ఎర్రగా పండిన టొమోటోలు.. పది
పంచదార.. రెండు కప్పులు
నెయ్యి.. ఒక కప్పు
జీడిపప్పు, బాదంపప్పు.. రెండూ కలిపి అర కప్పు
బొంబాయి రవ్వ.. ఒక కప్పు
యాలకుల పొడి.. రెండు టీ.

తయారీ విధానం :
ముందుగా టొమోటో పండ్లను ఉడికించి గుజ్జు తీయాలి. బాణలిలో నెయ్యి వేడిచేసి ముందుగా జీడిపప్పు, బాదంపప్పు వేయించాలి. ఆ తరువాత అదే బాణలిలో బొంబాయి రవ్వను వేసి దోరగా వేయించాలి. మరో పాత్రలో రెండు కప్పుల నీరు తీసుకుని మరిగించి, వేయించిన బొంబాయి రవ్వను కలపాలి. ఇది దగ్గరపడిన తరువాత టొమోటో గుజ్జు, పంచదార, జీడిపప్పు, బాదంపప్పు, నెయ్యి వేసి కలియబెట్టాలి. చివర్లో యాలకుల పొడి చల్లితే రుచికరమైన టొమోటో హల్వా సిద్ధమైనట్లే..!!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.