మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » భారతీయ » గంజితో సమ్మర్ స్పెషల్ "లెమన్ డ్రింక్" (Indian | Ganji | Lemons | Mint Leaves | Black Salt)
Bookmark and Share Feedback Print
 
Juice
FILE
కావలసిన పదార్థాలు :
అన్నం వార్చిన గంజి... నాలుగు కప్పులు
నిమ్మకాయలు.. నాలుగు
పుదీనా.. ఒక కప్పు
బ్లాక్ సాల్ట్.. రెండు టీ.

తయారీ విధానం :
ముందుగా అన్నం వార్చిన గంజికి రెండు కప్పుల నీటిని చేర్చి పల్చగా తయారు చేయాలి. తరువాత పుదీనాను ముద్దలా నూరి, రసాన్ని గంజిలో పిండాలి. అందులోనే నిమ్మకాయల రసం, బ్లాక్ సాల్ట్ కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఓ గంటపాటు ఫ్రిజ్లో ఉంచాలి. బాగా చల్లబడిన తరువాత బయటకు తీసి సర్వింగ్ గ్లాసులలోకి ఒంపి, పైన ఐస్ ముక్కల్ని వేసి సర్వ్ చేయాలి. అంతే రుచికరమైన లెమన్ డ్రింక్ తయారైనట్లే. ఇది వేసవిలో దాహార్తిని తీర్చటమేగాకుండా, ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.