మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » భారతీయ » జీర్ణశక్తి పెంపొందించే "క్యారెట్ ఆవకాయ" (Indian | Carrot | Mustard Powder | Chili Powder | Salt | Cumin Seeds Powder | Garlic | Lemon Juice | Oil)
Bookmark and Share Feedback Print
 
Carrot
FILE
కావలసిన పదార్థాలు :
క్యారెట్లు.. ఒక కేజీ
ఆవపిండి.. పావు కప్పు
కారం.. పావు కప్పు
ఉప్పు.. తగినంత
జీలకర్ర పొడి.. పావు కప్పు
వెల్లుల్లి.. గుప్పెడు
నిమ్మరసం.. ఒక కప్పు
నూనె.. తగినంత

తయారీ విధానం :
క్యారెట్లను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. ఆ తరువాత వాటిని కావాల్సిన సైజులో ముక్కలుగా తరిగి ఉంచాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆవపిండి, జీలకర్ర పొడి, కారంపొడి, తగినంత ఉప్పు, వెల్లుల్లి రేకలు వేసి బాగా కలియబెట్టాలి. అందులోనే క్యారెట్ ముక్కలు, సరిపడా నూనె వేసి బాగా కలపాలి. చివర్లో నిమ్మరసం కలిపి జాడీలోకి తీసుకోవాలి. అంతే మూడోరోజుకి నోరూరించే క్యారెట్ ఆవకాయ సిద్ధమైనట్లే..!

రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యాన్నిచ్చే క్యారెట్ ఆవకాయ అన్ని వయస్సులవారికీ మంచిదే. ఇది ఆహారంతో కలిపి తీసుకోవటంవల్ల అందులో పీచు పదార్థాలు అధికంగా లభించి శరీరంలో జీర్ణశక్తి పెంపొందుతుంది. కంటిచూపును మెరుగుపరిచే విటమిన్-ఏ కూడా క్యారెట్లలో అధికంగా లభిస్తుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.