కావలసిన పదార్థాలు :చికెన్... ఒక కేజీకారంపొడి... రెండున్నర టీస్పూన్లుపచ్చిమిర్చి... ఆరువెల్లుల్లి... రెండుజీలకర్ర పొడి... ఒక టీస్పూన్ఉల్లిపాయ... పెద్దది ఒకటికార్న్ఫ్లోర్... రెండు టీస్పూన్లుపుల్లటి మీగడ... అరకప్పునీరు... తగినంతఉప్పు, నూనె... సరిపడాతయారీ విధానం :చికెన్‌కు కారం, జీలకర్రపొడి, ఉప్పు కలిపి పట్టించాలి. పాన్‌లో నూనె వేడిచేసి చికెన్‌ను కొద్ది వేయించి, వెల్లుల్లి, ఉల్లి, పచ్చిమిర్చి కలపాలి. కొద్దిగా నీరు పోసి మూతపెట్టి, కాసేపు మగ్గనివ్వాలి.తరువాత చికెన్‌ను విడిగా తీసి, నెమ్మదిగా ఒత్తుతూ, కూరలోని జ్యూస్‌నంతా తీసివేయాలి. ఈ కూర జ్యూస్‌ను పాన్‌లో పోసి, కార్న్‌ఫ్లోర్ కలిపి సన్నటి మంటపై ఉడికించాలి. ఉడుకుతుండగా ఆ మిశ్రమాన్ని కలుపుతూ చిక్కబడేదాకా ఉంచి, చివర్లో మీగడ కలపాలి.తరువాత ఈ మిశ్రమాన్ని చికెన్‌పై పోయాలి. అంతే మిర్చి చికెన్ రెడీ అయినట్లే...! దీన్ని అన్నం బిర్యానీ, చపాతీ, పరోటాలలోకి సైడ్‌డిష్‌గా వాడుకోవచ్చు. |