కావలసిన పదార్థాలు :ఎముకలు లేని చికెన్... అరకేజీనిమ్మరసం... నాలుగు టీస్పూన్లుఅల్లం రసం... మూడు టీస్పూన్లుతెల్ల మిరియాలపొడి... అర టీస్పూన్ఉప్పు... సరిపడాజాజికాయ, జాపత్రి పొడి... అర టీస్పూన్క్యాప్సికమ్... మూడుటొమోటో... ఐదుచాట్ మసాలా... ఒక టీస్పూన్కారం... అర టీస్పూన్జీలకర్ర పొడి... అర టీస్పూన్వడగట్టిన పెరుగు... ఒకటిన్నర కప్పుతయారీ విధానం :చికెన్ ముక్కల్ని కడిగి... నిమ్మరసం, అల్లం రసం, ఉప్పు వేసి బాగా కలిపి పావుగంటసేపు నానబెట్టాలి. ఒక బౌల్‌లో పెరుగు, జాజికాయ, జాపత్రి పొడి, కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కలకు పట్టించాలి.ఇప్పుడు క్యాప్సికమ్, టొమోటోలను కూడా పెద్ద ముక్కలుగా కోసి చికెన్ ముక్కల్లో కలిపి 15 నిమిషాలపాటు నానబెట్టాలి.చివరిగా, ఒక ఇనుప చువ్వకు చికెన్, క్యాప్సికమ్, టొమోటో ముక్కలను కలిపి గుచ్చి... నిప్పుల మీద ఓ పది నిమిషాలు కాల్చి, తీసి వేడి వేడిగా పుదీనా చట్నీతో కలిపి వడ్డించండి. |