కావలసిన పదార్థాలు :పీతలు... అరకేజీచింతపండు గుజ్జు... తగినంతవేరుశెనగనూనె... సరిపడావెల్లుల్లి... 15 రేకలుఆవాలు, జీలకర్ర... తగినన్నిమసాలా దినుసులు... ఒక టీస్పూన్గసగసాలు... మూడు టీస్పూన్లుధనియాలు... ఒక టీస్పూన్ఉల్లిపాయలు... రెండుటొమోటో... మూడుకరివేపాకు, కొత్తిమీర... తగినంతలవంగాలు... నాలుగుదాల్చిన చెక్క... కొద్దిగాపసుపు... చిటికెడుమీగడ... కొద్దిగాతయారీ విధానం :మసాలా దినుసులు, దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు, గసగసాలు.. అన్నింటినీ కలిపి మెత్తగా పొడి చేసుకోవాలి. పీతలను శుభ్రం చేసుకుని ఒక గిన్నెలో వేసి, తగినంత నీరు పోసి ఉడికించుకోవాలి. ఓ పదినిమిషాలపాటు ఉడికిన తరువాత తీసి, పీతల పెంకును పగులగొట్టి లోపలి మాంసాన్ని తీసి, ముక్కలు చేసుకోవాలి.స్టవ్‌పై పాన్ పెట్టి, అందులో తగినంత వేరుశెనగ నూనె, ఆవాలు, జీలకర్ర వేసి పోపు పెట్టాలి. అందులోనే ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, టొమోటో ముక్కలు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. దీంట్లోనే పొడిచేసి ఉంచిన మసాలా పొడిని వేసి బాగా వేయించాలి. తరువాత చింతపండు గుజ్జు, పీతల మాంసం వేసి కలపాలి. సరిపడా ఉప్పువేసి, మాంసం ముక్కలకు మసాలా బాగా పట్టేలా వేయించాలి. కూర ఉడికిన తరువాత తీసి ఓ గిన్నెలో వేసి వెంటనే దానికి మీగడ కలపాలి. బాగా కలిపి, పైన కొత్తిమీర తరుగును చల్లి.. వేడి వేడిగా అతిథులు వడ్డించండి. |