కావలసిన పదార్థాలు :చికెన్... అరకేజీచుక్కకూర... ఎనిమిది కట్టలుఉల్లిపాయలు... రెండుఅల్లం వెల్లుల్లి మిశ్రమం... తగినంతకారం... ఒకటిన్నర టీస్పూన్పసుపు... పావు టీస్పూన్పచ్చిమిర్చి... ఎనిమిదినూనె... నాలుగు టీస్పూన్లుఉప్పు... సరిపడాధనియాలపొడి... రెండు టీస్పూన్లుగరంమసాలా... పావు టీస్పూన్కొత్తిమీర... మూడు కట్టలుతయారీ విధానం :ఒక గిన్నెలో నూనె పోసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి మిశ్రమం, పచ్చిమిర్చి, కారం, జీలకర్ర, ధనియాల పొడి చేర్చి కాసేపు వేయించాలి.ఆపై చికెన్ ముక్కలను కలిపి, ఉప్పు, గరంమసాలా వేసి బాగా కలిపి మూత పెట్టి, సన్నటి మంటపై ఓ ఇరవై నిమిషాలపాటు ఉడికించాలి. చివరగా తరిగిన చుక్కకూర వేసి మరో 15 నిమిషాల పాటు ఉడికించి, కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి దించేయాలి. అంతే చుక్కకూరతో చికెన్ రెడీ అయినట్లే... దీన్ని వేడి వేడి అన్నం, చపాతీలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. |