కావలసిన పదార్థాలు :చికెన్ రెక్కభాగాలు... ఎనిమిదిచికెన్ తొడ భాగాలు... ఎనిమిదియాలక్కాయలు... ఐదులవంగాలు... మూడుచెక్క... ఒకటిఉల్లిపాయల పేస్ట్... నూట యాభై గ్రామలుఅల్లం పేస్ట్... యాభై గ్రాములుటొమేటో గుజ్జు... రెండు కప్పులుకారం... రెండు టీస్పూన్లుధనియాల పొడి... రెండు టీస్పూన్లుపసుపు... అర టీస్పూన్ఉప్పు, నూనె... తగినంతకొత్తిమీర తరుగు... సరిపడాపుదీనా తరుగు... సరిపడాతయారీ విధానం :ముందుగా కడాయిలో నూనె వేసి యాలక్కాయలు, చెక్క, లవంగాలను వేయించాలి. అందులోనే ఉల్లిపాయల పేస్ట్, అల్లం పేస్ట్ కలిపి వేయించాలి. టొమోటో గుజ్జును కూడా కలిపి సన్నటి మంటమీద ఉడికించాలి. నీరు ఇగిరిపోయేదాకా అలానే ఉంచి, తరువాత మంటను పెంచి నూనె పైకి తేలేదాకా ఉడికించాలి.ఇప్పుడు ధనియాలపొడి, కారం, పసుపు, ఉప్పు, అరకప్పు నీటిని కలిపి... మళ్లీ ఆయిల్ పైకి తేలేదాకా ఉడికించాలి. తరువాత చికెన్, సరిపడా ఉప్పు వేసి నాలుగన్నర కప్పుల నీటిని పోసి మీడియం మంటమీద ఉడకనివ్వాలి. మధ్యమధ్యలో కూరను కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది.గ్రేవీ చిక్కబడకముందే కూరను కిందికి దించేసి... కొత్తిమీర, పుదీనా తరుగులను పైన చల్లాలి. అంతే... హైదరాబాదీ జింజర్ చికెన్ కర్రీ రెడీ అయినట్లే...! దీనిని వేడి వేడి అన్నం, చపాతీలు, పుల్కాలు, తందూరీలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. సన్నటి జల్లులు పడుతున్న సమయంలో ఇలాంటి కూరను చేసుకుని వేడి వేడి తింటే... ఆ ఆనందమే వేరులే. మీరూ ప్రయత్నించండి మరి..! |