కావలసిన పదార్థాలు :ఎముకలు లేని, చర్మం తీసేసిన చికెన్ : అరకేజీవెజిటబుల్ ఆయిల్... రెండు టీస్పూన్లుక్యారెట్ ముక్కలు... రెండు కప్పులుకాలీఫ్లవర్ ముక్కలు... ఏడుచికెన్ స్టోక్... మూడు కప్పులుపోపు గింజలు... రెండు టీస్పూన్లుచిన్నగా షేప్ చేసిన పాస్తా... ఒక కప్పుఉప్పు, మిరియాల పొడి... రుచికి సరిపడాఉల్లిపాయ... ఒకటితయారీ విధానం :పాన్‌లో వెజిటబుల్ ఆయిల్‌వేసి, కాస్త వేడయ్యాక అందులో ఉల్లిపాయ, క్యారెట్, కాలీ ఫ్లవర్ ముక్కలు, చికెన్ వేసి రంగు మారే వరకు వేయించాలి. వీటిని బాగా కలుపుతూ చికెన్ స్టోక్‌ని కలిపి పోపు గింజలు, పాస్తా షేప్స్ వేసి ఉడికించాలి. నీరు అంతా ఇంకిపోయే వరకు ఉడికిస్తూనే ఉండాలి.తరువాత మంటని సిమ్‌లో ఉంచి 10 నిమిషాల పాటు డీప్‌ఫ్రై చేయాలి. అలంకరణ బాగా చేయాలంటే పాస్తాను విడిగా వేయించుకోవచ్చు. చివరగా.... మిరియాల పొడి, ఉప్పును చల్లి, వేడివేడిగా బ్రెడ్‌తో సర్వ్ చేస్తే మంచి రుచిగా ఉంటుంది. |