కావలసిన పదార్థాలు :రొయ్యలు... ఒక కేజీగసగసాలు... ఆరు టీస్పూన్లుధనియాలు... రెండు టీస్పూన్లుఉల్లిపాయలు... నాలుగుఅల్లం... ఒక ముక్కఉప్పు... సరిపడాపచ్చిమిర్చి... పన్నెండునూనె... 400 గ్రాములుదాల్చిన చెక్క... పదిలవంగాలు... పదికొత్తిమీర... ఒక కట్టపసుపు... తగినంతతయారీ విధానం :రొయ్యలను శుభ్రంగా వలిచి, కడిగి ఒక పాత్రలో ఉంచుకోవాలి. తరువాత వాటిలో ఉప్పువేసి, నీరు ఇగిరిపోయేదాకా బాగా ఉడికించాలి. ఉడికించిన రొయ్యలను బాగా నూరి, అందులో ముందుగానే నూరి ఉంచుకున్న అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయల ముద్దను కూడా కలపాలి.తరువాత గసగసాలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, పసుపులను మెత్తగా పొడి చేసి... రొయ్యల మిశ్రమానికి పట్టించాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె పోసి బాగా కాగిన తరువాత... పైన నూరి ఉంచుకున్న రొయ్యల మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని... వడల్లాగా వత్తి కాగుతున్న నూనెలో వేయాలి.బంగారు వర్ణం వచ్చేదాకా వాటిని వేయించి న్యూస్ పేపర్ పరిచిన ఓ పాత్రలోకి తీసుకోవాలి. అలా మొత్తం మిశ్రమాన్నంతా వడల్లాగా చేసిన తరువాత సర్వింగ్ డిష్‌లో వాటిని సర్ది... పైన కొత్తిమీర తరుగు చల్లి అతిథులకు వడ్డించాలి. వీటిని వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా రుచిగా ఉంటాయి. ఏదేని గ్రీన్ చట్నీ లేదా టమోటో సాస్, పచ్చిమిర్చి సాస్‌లతో కలిపి తింటే బాగుంటాయి. |