కావలసిన పదార్థాలు :నాటుకోడి గుడ్లు... నాలుగుఉల్లిపాయలు... పదిపచ్చిమిర్చి... ఆరుఅల్లం, వెల్లుల్లి పేస్ట్... ఒక టీస్పూన్కరివేపాకు... రెండు రెబ్బలుమిరియాల పొడి... కాస్తంతకొత్తిమీర తరుగు... అర కప్పుఎండుకారం... ఒక టీస్పూన్గరం మసాలా.... ఒక టీస్పూన్ఉప్పు, పసుపు... తగినంతనూనె... సరిపడాతయారీ విధానం :ముందుగా నాటుకోడి గుడ్లను ఒక స్టీలు గిన్నెలోకి పగులగొట్టి పోయాలి. ఈ మిశ్రమాన్ని స్పూన్‌తో బాగా కలిపి, అందులో కొద్దిగా మిరియాల పొడి, చిటికెడు ఉప్పు వేసి మూత పెట్టి ఆవిరిమీద ఉడికించాలి.ఉడికిన తరువాత కోడిగుడ్ల మిశ్రమం జున్నులాగా గట్టిపడుతుంది. దీనిని మనకు కావాల్సిన సైజులో ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా నూనె వేసి కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని వేయించాలి. అందులోనే కోడిగుడ్డు ముక్కలు, తగినంత ఉప్పు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.కాసేపటి తరువాత ఎండుకారం (కారంపొడిని వెల్లుల్లితో కలిపి దంచుకుంటే ఎండుకారం తయారవుతుంది), గరంమసాలా వేసి వేయించాలి. చివర్లో కొత్తిమీర వేసి కాసేపు ఆగిన తరువాత దించేయాలి. ఇది వేడి, వేడి అన్నంలోకి, చపాతీ, పుల్కాలలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి మరి..! |