కావలసిన పదార్థాలు : చేపముక్కలు.. ఒక కేజీ కొబ్బరిపొడి.. రెండు టీ. జీలకర్ర పొడి.. ఒక టీ. కారంపొడి.. ఒక టీ. ధనియాలపొడి.. 2 టీ. మెంతిపొడి.. పావు టీ. పసుపు.. పావు టీ. ఉప్పు.. తగినంత అల్లంవెల్లుల్లి పేస్ట్.. ఒక టీ. చింతపండు పులుసు.. 2 టీ. నూనె.. సరిపడా నిమ్మకాయ.. ఒకటి
తయారీ విధానం : చేపను శుభ్రం చేసి వెడల్పుగా కావలసిన సైజులో కట్ చేసుకుని నిమ్మరసం పట్టించాలి. ఒక గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారంపొడి, జీలకర్ర పొడి, మెంతిపొడి, కొబ్బరిపొడి, పులుసు, చెంచాడు నూనె వేసి భాగా కలపాలి. ఈ మిశ్రమాన్నంతటిని ఒక ముద్దగా చేసుకుని చేప ముక్కలకు రెండువైపులా పట్టించాలి.
ఈ ముక్కలను అరగంట అలాగే ఉంచాలి తరువాత పెనం వేడి చేసి చేప ముక్కల్ని పరచి.. కొద్ది కొద్దిగా నూనె వేస్తూ రెండువైపులా ఎర్రగా కాల్చాలి. నిదానంగా కాలిస్తే ముక్కలు లోపలివరకు ఉడుకుతాయి. చివరిగా ఉల్లిపాయ, నిమ్మకాయ ముక్కలతో అలంకరించి వేడి, వేడిగా సర్వ్ చేస్తే సరి..!