మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » మాంసాహారం » కాకినాడ స్పెషల్ పీతల పిడుపు (Non Vegetarian | Crabs | Ginger | Garlic | Onion | Green Chilli | Chilli Powder | Garam Masala | Salt)
Feedback Print Bookmark and Share
 
కావలసిన పదార్థాలు :
పీతలు.. ఆరు
అల్లం.. పది గ్రా.
వెల్లుల్లి.. 6 రెబ్బలు
ఉల్లిపాయలు.. 2
పచ్చిమిరప.. 4
కారం.. 2 టీ.
గరంమసాలా.. ఒకటిన్నర టీ.
ఉప్పు.. తగినంత
కరివేపాకు.. రెండు రెబ్బలు
నూనె.. వంద గ్రా.
పసుపు.. చిటికెడు

తయారీ విధానం :
మొదట పీతలను వేడి నీటిలో 10 నిమిషాలు ఉడికించి పైన ఉన్న పొట్టు(డొల్ల)ను తొలగించి పిడుపును మాత్రం తీసి పక్కన పెట్టుకొవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరప, కొత్తిమిర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. వెల్లుల్లి, అల్లం గ్రైడ్ చేసి పేస్టును తయారుచేసి.. స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె వేసి.. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు వేసి దోరగా వేయించాలి.

అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా సన్నని మంటమీద వేపాలి. ఇప్పుడు కొద్దిగా గరంమసాలా, కరివేపాకు, నూనె, పీతలు, కారం, ఉప్పు వేసి కావాలనుకుంటే మరికొద్దిగా నూనెను జత చేసి కొద్దిగా నీరు పోయాలి.. స్పూన్‌తో కలియ బెడుతూ 5 నిమిషాలు మగ్గనివ్వాలి. అంతే కాకినాడ పీతల పిడుపు గుజ్జుకు తయార్..! దీనికి కొత్తిమిర చల్లి వడ్డిస్తే ఆ రుచే వేరు. చపాతీలకు బెస్ట్ కాంబినేషన్ అయిన ఈ వంటకాన్ని మీరూ ట్రై చేసి చూడండి మరి..!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.