మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » మాంసాహారం » క్షణాల్లో సిద్ధమయ్యే "ఎగ్ రోస్ట్" (Non-veg | Eggs | Oil | Turmeric Powder | Methi Powder | Cumin Seeds Powder | Coriander Powder)
Feedback Print Bookmark and Share
 
Curry
FILE
కావలసిన పదార్థాలు :
ఉడికించిన కోడిగుడ్లు.. రెండు
నూనె.. 2 టీ.
పసుపు.. చిటికెడు
మెంతిపొడి.. చిటికెడు
జీలకర్ర పొడి.. చిటికెడు
ధనియాలపొడి.. అర టీ.
కారం.. పావు టీ.
ఉప్పు.. తగినంత

తయారీ విధానం :
ఉడికించి పొట్టుతీసిన కోడిగుడ్లను రెండుగా నిలువుగా కట్ చేసుకోవాలి. పాన్‌లో నూనె వేడయ్యాక కట్ చేసిన గుడ్లు వేసి పసుపు, మెంతిపొడి, జీలకర్రపొడి, ధనియాలపొడి, కారం, ఉప్పు చల్లి కలియబెట్టి మూడు నిమిషాలపాటు వేయించి దించేయాలి. అంతే ఎగ్ రోస్ట్ తయార్..! కావాలనుకుంటే ఇందులో మిరియాలపొడి, గరంమసాలా, మెంతి ఆకులు కూడా వేసి రోస్ట్ లాగా చేసుకోవచ్చు.

ఇంట్లో కూరగాయలేమీ లేకపోయినా.. పప్పు, సాంబార్ లాంటి కూరలకు సైడ్‌డిష్ ఉంటే బాగుంటుందని అనిపించినా వెంటనే గుర్తొచ్చేది కోడిగుడ్లే. ఎంతో బలవర్ధకమైన ఈ గుడ్లతో రకరకాల వంటకాలు చేయవచ్చు. అయితే క్షణాల్లో తయారయ్యే ఈ ఎగ్‌రోస్ట్‌ను చేయటం నేర్చుకుంటే.. మళ్లీ మళ్లీ దీన్నే చేస్తుంటారంటే ఆశ్చర్యం లేదు..! సో.. ట్రై చేయండి మరి..!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.