కావలసిన పదార్ధాలు : కోడి మాంసం.. ఒక కిలో లవంగాలు.. ఆరు కారం.. 2 టీ. ఉప్పు.. సరిపడా పసుపు.. కొంచెం గసగసాలు.. 50 గ్రా. నూనె.. 100 గ్రా. పచ్చిమిర్చి.. 8 ఉల్లిపాయలు.. 4 నిమ్మకాయ.. ఒకటి అల్లం.. 50 గ్రా. పెరుగు.. పావు లీ. వెల్లుల్లిపాయలు.. 2 దాల్చిన చెక్క.. 6 ధనియాలు.. 6 టీ. యాలకులు.. 8 జీడిపప్పు.. 50 గ్రా. కొత్తిమీర.. ఒక కట్ట
తయారీ విధానం : అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిలను మెత్తగా ముద్దగా నూరుకోవాలి. గసగసాలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలను వేడి చేసి మెత్తగా నూరి ఉంచుకోవాలి. శుభ్రంచేసిన చికెన్‌లో అల్లం ముద్ద, ఉప్పు, నిమ్మరసం కలుపుకోవాలి. బాణలిలో నూనె పోసి కాగిన తరువాత యాలకులు, జీడిపప్పు వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయను సన్నటి ముక్కలుగా తరిగి అందులో వేసి కలపాలి.
ఉల్లిపాయలు బాగా వేగాక చికెన్‌ని అందులో వేసి.. కొంచెం పసుపు, కారం వేసి బాగా కలిపి మూత పెట్టాలి. మాంసంలోని నీరంతా ఇంకి పోయిన తరువాత తగినన్ని నీళ్ళు పోసి ఉడికించాలి. మాంసం ఉడికాక.. మసాలా ముద్దను పెరుగులో కలిపి దాన్ని కూరలో వేసి బాగా కలపాలి. మరికాసేపు ఉడికించిన తరువాత దించి వేడి వేడిగా వడ్డించాలి.