మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » మాంసాహారం » చపాతీ, పరోటా స్పెషల్.. "దమ్‌కా జిగర్ చికెన్" (Non Vegetarian | Chicken | Onion | Curd | Ginger | Green Chili | Chili Powder | Pepper Powder)
Feedback Print Bookmark and Share
 
chicken
FILE
కావలసిన పదార్ధాలు :
ఉల్లిపాయలు... రెండు
పెరుగు... అరకప్పు
చికెన్... అర కిలో
అల్లం... 15 గ్రాములు
పచ్చిమిర్చి... నాలుగు
కారం... ఒక స్పూను
మిరియాల పొడి... అర టీ.
కొత్తిమీర... ఒక కట్ట
పసుపు... కొంచెం
ఉప్పు... సరిపడా

తయారీ విధానం :
కోడి మాంసాన్ని శుభ్రం చేసుకొని దాన్ని కొంచెం ఉప్పు, పసుపు కలిపిన నీళ్ళల్లో ఉడికించి కొన్ని నీళ్లు ఉండగానే దింపేయాలి. మొత్తం అల్లంలోని మూడో వంతు భాగాన్ని తీసి తురిమి ఉంచుకోవాలి. మిగిలిన అల్లాన్నంతటికీ మెత్తగా నూరుకోవాలి. కడాయిలో నూనె వేసి అల్లం పేస్టును వేసి కాఫీ కలర్ వచ్చేదాకా బాగా వేయించాలి.

దానికి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమోటో ముక్కలు, ఉప్పు, పసుపు కలిపి వేయించాలి. టొమోటోలు బాగా ఉడికాక.. దానికి కారం, పెరుగు, అల్లం తురుము, ఉడికించిన మాంసం వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలియబెట్టాలి. నీళ్ళన్నీ బాగా ఇగిరిపోయేదాకా ఉడికించి దించేముందు కొత్తిమీర చల్లి దించుకోవాలి. అంతే దమ్‌కా జిగర్ చికెన్ రెడీ. ఇది చపాతీ, పరోటాలలోకి చాలా బాగుంటుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.