మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » మాంసాహారం » నోరూరించే మటన్ రోస్ట్ రెడీ చేయండిలా.... (Mutton | non veg | Dishes)
FILE
కావలసిన పదార్థాలు:

మటన్ - ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు, మిరియాల పొడి - ఒక టీ స్పూన్, పసుపు - ఒక టీ స్పూన్, కారం - ఒక టీ స్పూన్, చాట్ మసాలా - ఒక టీ స్పూన్, నిమ్మరసం - ఒక టీ స్పూన్, ఉప్పు - తగినంత, నూనె - తగినంత.

తయారు చేసే విధానం:

మొదట మటన్‌ని సుభ్రం చేసుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి సుభ్రంచేసిన మటన్ ముక్కలను వేయించి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నూనెలో ఉల్లిపాయ ముక్కలను వేయించి, వేగిన తర్వాత పసుపు, కారం, ఉప్పు, మటన్ ముక్కలు వేసి కలిపి పైన చాట్‌మసాలా, మిరియాల పొడి చల్లి ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి. చివరగా నిమ్మరసం కలిపి దించేయాలి. అంతే ఏంతో రుచికరమైన మటన్ రోస్ట్ రెడీ.
సంబంధిత సమాచారం
WebduniaWebdunia