కోడిగుడ్లు - 3, ఓట్స్- ఒకటిన్నర కప్పు, ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి - అర టీ స్పూన్, కోడిగుడ్టు- 1 ఉడకబెట్టనిది, నూనె- వేయించడానికి తగినంత, చాట్‌మసాలా- టీ స్పూన్, నిమ్మరసం- టీ స్పూన్.
తయారు చేసే విధానం:
ఒక పాత్రలో ఓట్స్, గుడ్డు సొన, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి, చాట్‌మసాలా వేసి బాగా కలపాలి. ఉడికించిన గుడ్డును అందులో వేసి మిశ్రమమంతా బాగా పట్టేలా తిప్పాలి. స్టౌపై బాణలి పెట్టి నూనె కాగనివ్వాలి. ఆ గుడ్డును నూనెలో వేసి ఓట్స్ మిశ్రమం గోధుమరంగులోకి మారేంతవరకు వేయించాలి. ఆ గుడ్డును కత్తితో మీకు ఇష్టం వచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్‌చేసి ప్లేట్‌లో సర్ది తినాలి.