కావలసిన పదార్ధాలు :
3అరటి కాయలు, 10గ్రాములు జీడిపప్పు, 2చెంచాల శెనగపప్పు, ఒకటిన్నర చెంచా మినపప్పు, ఒకచెంచా ఆవాలు, అర కప్పు కందిపప్పు, కొద్దిగా కొబ్బరికోరు, 4పచ్చిమిరపకాయలు, తగినంత నూనె, రెండు రెమ్మలు కరివేపాకు, కొద్దిగా ఇంగువ, తగినంత ఉప్పు.
తయారీ విధానం :
ముందుగా ఒక బాణలి తీసుకుని అందులో నీరుపోసి అరటికాయలను ఉడకబెట్టి దించుకొని, అరటి తొక్కలను తీసివేసి పక్కన పెట్టుకోవాలి. ఆతర్వాత కంది పప్పును కూడా ఉడికించి దించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉడికి న అరటికాయ ముక్కలకు తగినంత ఉప్పు కలిపి మిక్సీ లో వేసి మెత్తగా చేయాలి. అదేవిధంగా ఉడికిన కందిప్పును కూడా మిక్సీచేసి పట్టుకోవాలి. ఆతర్వాత ఒక బాణలి తీసుకుని నూనె వేసి వేడిచేసి దానిలో ఆవాలు,జీడిప్పు,అల్లం,పచ్చిమిరపకాయలు వేసి వేయించి ఈమిశ్రమానికి సిధ్ధంగా ఉన్నఅరటిగుజ్జును, ఉడికించిన కందిప్పు జతచేసి కొంచెం సేపు వేయించి, దానికి కొబ్బరి కోరును కలిపి సన్నమంటమీద ఉడికించి దించుకొని దాని పైన కరివేపాకు చల్లాలి.
|