కావలసిన పదార్థాలు :వెల్లుల్లిరేకులు... మూడు కప్పులుఅల్లం పేస్ట్.... అరకప్పు కారం... ఒక కప్పుఉప్పు... సరిపడమెంతిపొడి... పావు కప్పు జీలకర్ర... ఒక టీ స్పూన్ఆవపిండి... అర కప్పు.ఇంగువ... అర టీ స్పూను.నిమ్మరసం...ఒక కప్పునువ్వులనూనె... రెండు కప్పులు.పసుపు.. అరటీస్పూన్ తయారీ విధానం :ముందుగా వెల్లుల్లి రేకుల్ని, అల్లం ముక్కల్ని పొట్టుతీసి శుభ్రం చేసుకోవాలి. ఓ బాణలిలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, ఇంగువ, మెంతిపొడి, జీలకర్ర, పసుపు, వెల్లుల్లి రేకులు, అల్లం పేస్ట్‌ను వేసి బాగా దోరగా వేయించాలి. వెల్లుల్లి రెబ్బలు బాగా వేగాక నిమ్మరసం వేసి బాగా కలిపాలి. తరువాత మిగిలిన నువ్వుల నూనెను వేడిచేసి పచ్చడిమీద పోయాలి. ఈ పచ్చడిని పొడిగా ఉన్న ఓ గాజు పాత్రలోకి నిల్వ ఉంచుకుంటే మూడునెలలపాటు అలాగే ఉంటుంది. |