ఉసిరికాయలతో పులిహోర

FILE
కావలసిన పదార్థాలు :
ఉసిరికాయలు... ఎనిమిది
బియ్యం... అరకేజీ
ఆవాలు... అరటీ.
శెనగపప్పు... రెండు టీ.
పల్లీలు... రెండు టీ.
మినప్పప్పు... ఒక టీ.
కరివేపాకు... ఒక కట్ట
పసుపు... పావు టీ.
ఎండుమిర్చి... నాలుగు
పచ్చిమిర్చి... ఐదు
పంచదార... పావు టీ.
నూనె... నాలుగు టీ.
ఉప్పు... తగినంత.

తయారీ విధానం :
ఉసిరికాయల్లో గింజ తీసి ఉప్పు చేర్చి ఉడికించాలి. తరవాత మెత్తగా మెదిపి ముద్దలా చేయాలి. అన్నం వండి చల్లార్చాలి. ఒక బాణలిలో నూనె వేసి ఆవాలు, ఎండుమిర్చి, శెనగపప్పు, పల్లీలు, మినప్పప్పులను వేసి ఎర్రగా వేయించాలి. అవి వేగాక ఉసిరి ముద్దను కూడా వేసి వేయించి దించేముందు పసుపు, కరివేపాకు, నిలువుగా చిల్చిన పచ్చిమిర్చి వేయాలి.

Ganesh|
ఈ మిశ్రమాన్ని వండి చల్లార్చి ఉంచిన అన్నంలో కలిపి ఉప్పు సరిచూడాలి. చివరగా పంచదార కూడా వేసి కలిపి ఓ గంటసేపు అలాగే ఉంచిన తరువాత తింటే చాలా రుచిగా, వెరైటీగా ఉంటుంది.


దీనిపై మరింత చదవండి :