కావలసిన పదార్థాలు :అన్నిరకాల కూరగాయల ముక్కలు... రెండు కప్పులుఉప్పు.... తగినంతకారం... అర కప్పుమెంతిపొడి... ఒక టీ.ఇంగువ... పావు టీ.ఆవాలు... ఒక టీ.నిమ్మరసం... అర కప్పునువ్వులనూనె... అర కప్పుపసుపు... అర టీ.తయారీ విధానం :ముందుగా కూరగాయలన్నింటినీ తీసుకుని కడిగి సన్నని ముక్కలుగా కోసి ఎండబెట్టాలి. ఎండిన ముక్కల్ని కుక్కర్‌లో వేసి ఆవిరిమీద 2 నిమిషాలు ఉడికించాలి. ఓ బాణలిలో నువ్వులనూనె పోసి కొద్దిగా వేడిచేసి ఆవాలు వేయాలి. అవి వేగిన తరవాత ఇంగువ, మెంతిపిండి, పసుపు, ఉడికించిన కూరగాయ ముక్కలు అన్నీ వేసి కలపాలి.మొత్తం పచ్చడిని వేరే పాత్రలోకి వంపి ఉప్పు, కారం కొద్దికొద్దిగా వేస్తూ కలపాలి. చివరగా నిమ్మరసం కూడా జోడించి మిగిలిన నూనెను పచ్చడిమీద పోస్తే రుచికరమైన మిక్స్‌డ్ వెజిటబుల్ పచ్చడి సిద్ధమైనట్లే...! |