కావలసిన పదార్థాలు : పాలకూర... రెండు కట్టలుపనీర్... వంద గ్రా.కోవా... అర టీ.మెంతికూర... ఒక కట్టనూనె... తగినంతటొమాటోలు... రెండుఉల్లిపాయ... ఒకటిగరంమసాలా... అర టీ.ఉప్పు... తగినంత తయారీ విధానం :పాలకూరను సన్నగా తరిగి ఉడికించి నీళ్లు వంపేయాలి. తరవాత దీన్ని మెత్తగా రుబ్బాలి. బాణలిలో నూనె వేసి కాగాక రుబ్బిన పాలకూర పేస్టు, కోవా, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి వేయించాలి. చివరగా మెంతికూర కూడా వేసి ఉడికించి ఉప్పు, గరంమసాలా చల్లి బాగా కలిపి దించేయాలి. అంతే వేడి వేడి మెంతి పాలక్ చమన్ రెడీ అయినట్లే..! |