కావలసిన పదార్థాలు : గోరుచిక్కుడు... అర కేజీఇంగువ... పావు టీ.అల్లంవెల్లుల్లి... రెండు టీ.పసుపు... అర టీ.ధనియాలపొడి... ఒక టీ.మసాలాపొడి... ఒక టీ.కారం... ఒక టీ.ఉప్పు... తగినంత తయారీ విధానం :గోరుచిక్కుళ్లను అంగుళం చొప్పున ముక్కలుగా కోసుకోవాలి. చిన్న కుక్కర్ లేదా ప్రెషర్‌పాన్‌లో తగినన్ని నీళ్లు పోసి ఉడికించి, తరువాత నీళ్లు వంపేయాలి. బాణలిలో నూనె వేసి వేడి చేసి ఇంగువ, అల్లంవెల్లుల్లి వేసి గోధుమరంగులోకి మారేవరకూ వేయించాలి. ఆపై ఉడికించిన గోరుచిక్కుడు ముక్కలు, మసాలా, ధనియాలపొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. ఓ ఐదునిమిషాలు వేయించి తీయాలి. అంతే గోరు చిక్కుడు మసాలా రెడీ అయినట్లే..! |