కావలసిన పదార్థాలు : బీన్స్... పావు కేజీవంకాయలు... వంద గ్రా.అల్లం... చిన్న ముక్కవెల్లులి... రెండు పాయలుపచ్చిమిర్చి... మూడుపసుపు... చిటికెడుజీలకర్ర పొడి... అర టీ.ఆవాలు... పావు టీ.బెల్లం... కాస్తంతనిమ్మకాయ... ఒకటిఇంగువ... చిటికెడుఉప్పు... తగినంతనూనె... మూడు టీ.తయారీ విధానం :బీన్స్, వంకాయలను పెద్ద ముక్కలుగా తరగాలి. పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిని కలిపి మెత్తని పేస్టులా చేసుకోవాలి. బాణలిలో నూనెను వేడిచేసి ఆవాలు, ఇంగువ, ఆ తరువాత బీన్స్ వేసి తగినంత నీటిని పోయాలి. బీన్స్ కొద్దిగా ఉడికిన తరవాత బెల్లం కలపాలి. ఆపై వంకాయ ముక్కలను కూడా కలిపి ఉడికించాలి. అందులోనే జీలకర్ర పొడి వేసి, నిమ్మకాయ రసం పిండాలి. చివరిగా రెండు నిమిషాల సేపు ఉడికించి తీస్తే, తోవర్ రింగన్ నుషార్ సిద్ధమైనట్లే...! |