కావలసిన పదార్థాలు : బచ్చలికూర... మూడు కట్టలు పనీర్... పావు కేజీపండు టొమాటోలు... నాలుగుఉల్లిపాయలు... రెండుకారం... ఒక స్పూనుఉప్పు... తగినంత పసుపు... చిటికెడుగరంమసాలా పొడి... ఒక స్పూనువెల్లుల్లి... 10 రేకలుఅల్లం... చిన్నముక్క నూనె... ఒక కప్పు కొత్తిమీర... ఒక కట్ట తయారీ విధానం :బచ్చలిని శుభ్రంగా కడిగి, సన్నగా తరిగి, ఉడికించి, మిక్సీలో కొద్దిగా గ్రైండ్ చేసి ఉంచాలి. ఉల్లిపాయలు తరిగి అల్లం వెల్లుల్లితో సహా మిక్సీలో గ్రైండ్ చేయాలి. పనీర్‌ను చిన్నచిన్న ముక్కలుగా కోసి, నూనెలో దోరగా వేయించి తీయాలి. రుబ్బి ఉంచిన ఉల్లిపాయల మిశ్రమాన్నికూడా దోరగా వేయించి.. అందులో టొమాటో, ఉప్పు, పసుపు, కారం, పనీర్ ముక్కలు వేసి ముక్కలు మునిగేలా నీళ్లు పోసి ఉడకనివ్వాలి.బాగా ఉడికిన తరవాత రుబ్బి ఉంచిన బచ్చలి కూడా వేసి, మరో రెండు నిమిషాలు ఉడికించి దించాలి. చివర్లో సన్నగా తరిగిన కొత్తిమీరచల్లి దించేయాలి. అంతే పనీర్ బచ్చలి కర్రీ తయారైనట్లే...! దీన్ని చపాతీలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. |