కావలసిన పదార్థాలు : చిన్న ఉల్లిపాయలు... పావు కేజీచింతపండు గుజ్జు... రెండు కప్పులుకొత్తిమీర తురుము... కొద్దిగాపచ్చిమిర్చి... మూడుఎండుమిర్చి... రెండుకారం... రెండు టీ.ధనియాలపొడి... మూడు టీ.అల్లం వెల్లుల్లి... ఒక టీ.ఆవాలు, జీలకర్ర... చెరో పావు టీ.పసుపు... పావు టీ.బెల్లంపొడి... ఒక టీ.శెనగపిండి... ఒక టీ.కరివేపాకు... రెండు రెమ్మలుఉప్పు... తగినంతతయారీ విధానం :ఓ బాణలిలో నూనె పోసి కాగాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు వేసి ఉప్పు, పసుపు చల్లి మూతపెట్టి సన్నసెగమీద కాసేపు మగ్గనివ్వాలి. తరవాత అల్లంవెల్లుల్లి వేసి మంచి వాసన వచ్చేవరకూ వేపి కారం, ధనియాలపొడి చల్లాలి.అందులోనే చింతపండు గుజ్జు వేసి నీళ్లుపోసి ఉడికించాలి. కొద్దిగా ఉడికిన తరవాత బెల్లంపొడివేయాలి. చివరలో శెనగపిండి కలిపిన నీళ్లు పోసి మూతపెట్టి చిక్కబడేవరకూ ఉడికించి కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే ఘుమఘుమలాడే ఉల్లికారం పులుసు రెడీ అయినట్లే...! |