కావలసిన పదార్థాలు : క్యాబేజీ... మీడియం సైజుది ఒకటిపచ్చిమిర్చి... నాలుగుఆవాలు... అర టీ.కరివేపాకు... ఒక రెమ్మకొబ్బరి... ఒక టీ.కొత్తిమీర తురుము... ఒక టీ.నూనె... ఒక టీ.ఉప్పు... తగినంత తయారీ విధానం :క్యాబేజీని సన్నగా తురమాలి. బాణలిలో నూనె వేసి వేడి చేసి ఆవాలు వేయాలి. అవి చిటపటమన్నాక కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి. తరవాత క్యాబేజీ తురుము, ఉప్పు వేసి రంగు మారకుండా ఐదు నుంచి పది నిమిషాలు వేయించి దించాలి. తరవాత కొబ్బరి, కొత్తిమీర తురుము వేసి కలిపితే గ్రీన్ క్యాబేజ్ స్పెషల్ సిద్ధమైనట్లే...! ఇది రుచికి రుచి... ఆరోగ్యానికి ఆరోగ్యానికీ చాలా శ్రేష్టమైనది కూడా...! |