ప్రధాన పేజి > ఇతరాలు > వంటకాలు > శాకాహారం > అరటికాయ శనగపప్పు వడ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అరటికాయ శనగపప్పు వడ
FILE
కావలసిన పదార్థాలు :
పచ్చి అరటికాయలు... నాలుగు
నానబెట్టిన శెనగపప్పు... ఒక కప్పు
ఉల్లిపాయలు... రెండు
కొత్తిమీర... ఒక కట్ట
బియ్యంపిండి... రెండు టీ.
పచ్చిమిర్చి... నాలుగు
ఉప్పు... తగినంత
అల్లం... కాస్తంత
నూనె... వేయించేందుకు సరిపడా

తయారీ విధానం :
అరటికాయలను ప్రెషర్‌కుక్కర్‌లో ఉడికించి తొక్క తీసేయాలి. చల్లారాక వాటిని మెత్తగా పిసికి పక్కన ఉంచాలి. నానబెట్టిన సెనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం... అన్నీ వేసి నీళ్లు పోయకుండా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని అరటికాయ ముద్దలో కలపాలి. ఉల్లిముక్కలు, బియ్యప్పిండి, ఉప్పు, కొత్తిమీర తురుము కూడా కలపాలి. ఈ ముద్దను గుండ్రంగా లేదా అరచేతిలో చిన్న వడలుగా చేసి నూనెలో ఎర్రగా వేయించి తీయాలి. వీటిని వేడివేడిగా టొమాటో కెచప్‌తో కలిపి తింటే బాగుంటాయి.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
గ్రీన్‌ క్యాబేజ్‌ స్పెషల్
ఉల్లికారం పులుసు
పనీర్‌ బచ్చలి కర్రీ
తోవల్‌ రింగన్‌ నుషార్‌
గోరుచిక్కుడు మసాలా
మెంతి పాలక్ చమన్