కావలసిన పదార్థాలు :చిన్న వంకాయలు... పదిఆవనూనె... అర కప్పులవంగాలు... నాలుగుపులావు ఆకులు... రెండుఇంగువ... చిటికెడుజీలకర్రపొడి... ఒక టీ.మెంతిపొడి... ఒకటిన్నర టీ.ఆవపొడి... ఒకటిన్నర టీ.సోంపు పొడి... ఒక టీ.కొత్తిమీర పొడి... ఒక టీ.కారం... రెండు టీ.పసుపు.... అర టీ.ఎండుమామిడి పొడి... రెండు టీ.ఉప్పు... తగినంతతయారీ విధానం :వంకాయల్ని బాగా కడిగి తుడవాలి. వాటిని గుత్తివంకాయకూరకు కోసినట్లుగా కాయవిడకుండా నిలువుగా చిలికలు చేసి పక్కనుంచాలి. ఓ గిన్నెలో పైన చెప్పుకున్న పొడులన్నీ వేసి కలిపి అందులోనే ఉప్పు, కారం కూడా వేసి ఈ మిశ్రమాన్ని చిల్చిన వంకాయల్లో కూరాలి.ఓ పాన్‌లో ఆవనూనె వేసి కాగిన తరువాత లవంగాలు, పలావు ఆకులు, ఇంగువ వేసి వేగాక మిశ్రమం నింపిన వంకాయల్ని కూడా వేసి కొద్దిగా వేయించాలి. తరవాత మూతపెట్టి మధ్యమధ్యలో కదుపుతూ తక్కువ మంటమీద మగ్గనిచ్చి దించేయాలి. |