కావలసిన పదార్థాలు :ఉసిరికాయలు... పదిఉల్లిపాయలు... రెండుపచ్చిమిర్చి... నాలుగునూనె... తగినంతఅల్లంవెల్లుల్లి... అర టీ.కారం... అర టీ.పసుపు... పావు టీ.పెరుగు... అర కప్పుశొంఠిపొడి... పావు టీ.గరంమసాలా... చిటికెడుకర్భూజ విత్తనాలు... 25 గ్రా.కొబ్బరి... కాస్తంతగసగసాలు... 3 టీ.ఉప్పు... తగినంతతయారీ విధానం :ఉసిరికాయల్ని చాకుతో గాట్లు పెట్టి ఉప్పు వేసి వేడినీళ్లలో 5 నిమిషాలు ఉడికించి తీయాలి. తరువాత కొంచెం నూనెలో వేయించి తీసి పక్కనపెట్టాలి. విడిగా ఓ గిన్నెలో కర్బూజ విత్తనాల్ని వేయించి తీయాలి. వీటిని కొబ్బరి, గసాలుతో కలిపి మెత్తని ముద్దలా నూరాలి. ఓ బాణలిలో కొంచెం నూనె వేసి ముందుగా సన్నని ఉల్లిపాయ ముక్కలను వేసి ఎర్రగా వేయించాలి. అందులోనే అల్లంవెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి ముక్కలు, కారం, ఉప్పు, పసుపు, గసాల ముద్దను కూడా వేసి నూనె తేలేవరకూ వేయించాలి. అరకప్పు పెరుగు వేసి కలిపి ఉడికించాలి. ఇప్పుడు గరంమసాలా, శొంఠిపొడి వేసి గ్రేవీలా చేయాలి. ముందే వేయించి పక్కన ఉంచిన ఉసిరికాయల్ని ఇందులో వేసి కలపాలి. ఇది చపాతీల్లోకీ అన్నంలోకీ కూడా బాగుంటుంది. |