కావలసిన పదార్థాలు :చిక్కుడుకాయలు... పావుకేజీబంగాళాదుంపలు... వంద గ్రా.పండు టొమోటోలు... మూడుఉల్లిపాయలు... మూడువెల్లుల్లి రెబ్బలు... పదిఅల్లం... కాస్తంతధనియాలు... ఒక టీ.దాల్చిన చెక్క... మూడులవంగాలు... ఐదుకారం... ఒక టీ.ఉప్పు... తగినంతపసుపు... అర టీ.నూనె... అర కప్పుకొత్తిమీర... ఒక కట్టతయారీ విధానం :చిక్కుడుకాయలు, బంగాళాదుంపలు, టొమాటోలు, ఉల్లిపాయలు అన్నీముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఉల్లిముక్కలు, అల్లం, వెల్లుల్లి, మసాలా దినుసులు, కారం వేసి మెత్తగా రుబ్బాలి. స్టవ్‌మీద మూకుడు పెట్టి నూనె వేసి కాగిన తరవాత రుబ్బిన ఉల్లిముద్ద వేసి వేయించాలి. కమ్మని వాసన వచ్చిన తరవాత చిక్కుడుకాయ ముక్కలు వేసి మరికొంతసేపు వేయించాలి. బంగాళాదుంపముక్కలు, టొమాటో ముక్కలు వేసి ఓ గ్లాసు నీళ్లు పోసి ఉప్పు, పసుపు వేసి ప్రెషర్‌పాన్‌లోకి మార్చాలి. ఒక్క విజిల్ వచ్చిన తరవాత దించి చల్లారిన తరవాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసి వడ్డించాలి. ఇది చపాతీలోకి బాగుంటుంది. |