కావలసిన పదార్థాలు :పుట్టగొడుగుల... పావు కేజీఉల్లిపాయలు... మూడువెల్లుల్లి పేస్ట్... ఒక టీ.కారం... రెండు టీ.పచ్చిమిర్చి... ఐదుపసుపు... పావు టీ.కొత్తిమీర... రెండు కట్టలునూనె... వంద గ్రా.గోంగూర... మూడు కట్టలుతయారీ విధానం :పుట్టగొడుగుల్ని శుభ్రంగా కడిగి, ఉడికించి పక్కన ఉంచాలి. గోంగూరను శుభ్రంగా కడిగి ఓ గ్లాసు నీళ్లు పోసి పచ్చిమిర్చి వేసి ఉడికించాలి. తరువాత ఈ ఆకుల్ని మెత్తగా మెదపాలి. ఒక గిన్నెలో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి దోరగా వేయించాలి.అందులోనే అల్లం వెల్లుల్లి, కారం, పసుపు వేసి కలపాలి. చివరిగా ఉడికించిన పుట్టగొడుగు ముక్కలను, గోంగూర, కొత్తిమీర, చగినంత ఉప్పు వేసి కలిపి ఓ ఐదు నిమిషాలు వేయించి దించేయాలి. అంతే వేడి వేడి గోంగూర పుట్టగొడుగుల కర్రీ సిద్ధమైనట్లే...! |