కావలసిన పదార్థాలు :చిక్కుడుకాయ ముక్కలు... 2 కప్పులుచింతపండుగుజ్జు... ఒక కప్పుకారం... అర కప్పునూనె... ఒక కప్పుఉప్పు... పావు కప్పుమెంతులు... 4 టీ.పసుపు... ఒక టీ.మినప్పప్పు... ఒక టీ.సెనగపప్పు... ఒక టీ.కరివేపాకు... 2 రెబ్బలువెల్లుల్లిపాయలు... 2ఆవాలు... 4 టీ.తయారీ విధానం :చిక్కుడుకాయ ముక్కలు శుభ్రంగా కడిగి పొడిబట్టమీద ఆరనివ్వాలి. చింతపండు గుజ్జుని ఓ కడాయిలో వేసి ఉడికించాలి. మరో బాణలిలో సగం నూనె పోసి ఆరిన చిక్కుడుకాయల ముక్కలు వేసి వేయించాలి. తరువాత వీటిని చింతపండు గుజ్జులో వేయాలి. ఇప్పుడు మిగిలిన నూనె కూడా బాణలిలో పోసి పోపు సామాను అంతా వేసి ఎర్రగా వేయించాలి.అందులోనే పొట్టు ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కొద్దిసేపు వేయించాలి. తరువాత కారం, కరివేపాకు వేసి అన్నింటినీ చింతపండు గుజ్జులో వెయ్యాలి. ఉప్పు, పసుపు కూడా వేసి అన్నీ కలిసేలా బాగా కలిపి పొడిగా ఉన్న సీసాలో పెట్టుకోవాలి. ఒకరోజు ఊరితే బాగుంటుంది. అంతే వెరైటీగా ఉండే చిక్కుడు ఊరగాయ రెడీ అయినట్లే..! ఇది పది పదిహేను రోజులవరకూ నిల్వ ఉంటుంది. |