ప్రధాన పేజి > ఇతరాలు > వంటకాలు > శాకాహారం > ప్రొస్టేట్ క్యాన్సర్‌కు చెక్ పెట్టే "కాలీప్లవర్‌ పచ్చడి"
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రొస్టేట్ క్యాన్సర్‌కు చెక్ పెట్టే "కాలీప్లవర్‌ పచ్చడి"
FILE
కావలసిన పదార్థాలు :
కాలీఫ్లవర్‌ ముక్కలు... రెండు కప్పులు
నూనె... మూడు టీ.
జీలకర్ర... అర టీ.
ఆవాలు... అర టీ.
మెంతులు... ఒక టీ.
ఆవపిండి... మూడు టీ.
కారం... రెండు టీ.
మెంతిపిండి... చిటికెడు
ఉప్పు... తగినంత
నిమ్మకాయలు... మూడు

తయారీ విధానం :
కాలీఫ్లవర్‌ని కడిగిన తరువాత ముక్కలుగా విడదీసి బట్టమీద ఆరబెట్టాలి. ఓ బాణలిలో నూనె పోసి జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి అవి చిటపటమన్నాక కాలీఫ్లవర్‌ ముక్కలు కూడా వేసి రెండు నిమిషాలు వేయించి దించాలి. ఈ ముక్కల్లో ఉప్పు, పసుపు, కారం, ఆవపిండి, మెంతిపిండి అన్నీ వేసి కలపాలి. చివరగా నిమ్మరసం పిండి మరోసారి కలిపితే కాలీఫ్లవర్‌ పచ్చడి రెడీ..!

కాలీఫ్లవర్‌ను ఆహారంలో తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన పైబర్, విటమిన్ సి లాంటివి అందటమే గాకుండా కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ కాలీఫ్లవర్‌ను తీసుకోవడం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ బారి నుంచి కూడా బయట పడవచ్చట. మరి ఇన్ని ఉపయోగాలున్న కాలీఫ్లవర్‌ను వెరైటీగా వండి ఆహారంలో తీసుకుంటారు కదూ...!
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
కారం ప్రియుల కోసం "మెంతి కారం కూర"
వెరైటీగా "చిక్కుడు ఊరగాయ" చేసేద్దామా...?
"అరటికాయ కూర" ఎలా చేయాలంటే...?
గోంగూర పుట్టగొడుగుల కర్రీ
చిక్కుడు మసాలా కూర
ఉసిరి మసాలా స్పెషల్