మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » శాకాహారం » "టొమోటో పాలకూర పప్పు"లో కార్బనాయిడ్లు అధికం (Cookery | Vegetarian | Tomato | Palak | Toor Dal | Green Chilli | Dry Chilli | Onion | Ghee | Mustrad | Salt)
Feedback Print Bookmark and Share
 
కావలసిన పదార్థాలు :
టొమోటోలు.. ఐదు
పాలకూర.. రెండు కట్టలు
కందిపప్పు.. ఒక కప్పు
పచ్చిమిర్చి.. ఐదు
ఎండుమిర్చి.. నాలుగు
ఉల్లిపాయలు.. రెండు
చింతపండు.. కొద్దిగా
నెయ్యి.. ఒక టీ.
ఆవాలు, జీలకర్ర.. ఒక టీ.
శనగపప్పు.. ఒక టీ.
వెల్లుల్లి రేకలు.. 4
కరివేపాకు.. రెండు రెమ్మలు
పసుపు.. పావు టీ.
ఉప్పు.. తగినంత
కారం.. తగినంత
ధనియాలపొడి.. ఒక టీ.
నూనె.. ఒక టీ.

తయారీ విధానం :
ముందుగా కందిపప్పును కుక్కర్‌లో 3 విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడికించాలి. పాత్రలో నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు వేసి దోరగా వేయించాలి. అందులోనే పాలకూర టొమోటోలను కూడా వేసి ఐదు నిమిషాలపాటు ఉడికించాలి. ఆపై చింతపండు రసం, ఉప్పు, కారం, పసుపు, ధనియాలపొడి వేసి కలియబెట్టాలి.

ముందుగా ఉడికించుకున్న పప్పును కూడా ఇందులో కలిపి పది నిమిషాలపాటు ఉడికించాలి. మరో పాత్రలో నెయ్యి వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, శనగపప్పు, వెల్లుల్లి, కరివేపాకు వేసి తాలింపు పెట్టి.. దానిని పప్పు పాలకూరతో కలిపితే ఘుమఘుమలాడే టొమోటో పాలకూర పప్పు రెడీ...!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.