మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » శాకాహారం » రుచికరమైన "కందిగింజల ఫ్రై కర్రీ" (Vegetarian Food | Tur Seeds | Tomato | Methi Leaves | Onion | Chili Powder | Ginger | Garlic | Curry Leaves)
Feedback Print Bookmark and Share
 
కావలసిన పదార్థాలు :
పచ్చి కందిగింజలు.. ఒక కప్పు
టొమోటోలు.. పావు కేజీ
మెంతి ఆకు.. ఒక కప్పు
ఉల్లిపాయ.. ఒకటి
కారం పొడి.. రెండు టీ.
అల్లం వెల్లుల్లి పేస్టు.. అర టీ.
కరివేపాకు.. రెండు రెమ్మలు
పసుపు.. పావు టీ.
గరం మసాలా.. పావు టీ.
కొత్తిమీర తురుము.. అర కప్పు
ఉప్పు, నూనె.. సరిపడా
పంచదార.. చిటికెడు

తయారీ విధానం :
బాణలిలో నూనె వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, మెంతి ఆకు, కారంపొడి, గరం మసాలా వేసి కలపాలి. తర్వాత కంది గింజలు, పసుపు, సన్నగా తరిగిన కరివేపాకు, తగినంత ఉప్పు వేసి కొంచెం సేపు వేగాక తర్వాత టొమోటో ముక్కలు, పంచదార వేసి ఉడికించాలి. సన్నటిమంట మీద కాసేపు ఉంచాక తరిగిన కొత్తిమీర వేసి దించి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే రుచికరమైన కందిగింజల ఫ్రై కర్రీ తయార్..!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.