కావలసిన పదార్థాలు : బెండకాయలు.. పావు కేజీ పల్లీలు.. 50 గ్రా. జీలకర్ర.. అర టీ. మినప్పప్పు.. అర టీ. ఆవాలు.. అర టీ. మిర్చిపొడి.. ఒక టీ. పసుపు.. అర టీ. ఉప్పు.. సరిపడా నిమ్మరసం.. ఒక టీ. పచ్చి కొబ్బరి తురుము.. ఒక టీ. నూనె.. తగినంత ధనియాలపొడి.. ఒక టీ. కొత్తిమీర తురుము.. కొద్దిగా
తయారీ విధానం : బెండకాయల్ని సన్నటి ముక్కలుగా తరిగి నూనెలో డీప్ ఫ్రై చేసి ఉంచాలి. పల్లీలను వేయించి పలుకులుగా పొడి చేసి ఉంచాలి. ఇప్పుడు ఒక బాణలిలో కొద్దిగా నూనె వేసి అందులో మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు, మిర్చిపొడి, ఉప్పు, పచ్చికొబ్బరి తురుము, పల్లీల పొడి, నిమ్మరసం, వేయించిన బెండకాయ ముక్కలను ఒక్కొక్కటిగా వేసి బాగా కలియబెట్టాలి.
అలాగే కాసేపు వేయించిన తరువాత చివర్లో పైన కొత్తిమీర చల్లి దించేసి వేడి వేడిగా వడ్డించాలి. అంతే వెరైటీగా ఉండే బెండీ పల్లీ ఫ్రై రెడీ.. బెండకాయల్లో ఏ, బీ, సీ విటమిన్లు పుష్కళంగా ఉంటాయి. ఇందులో పలు పోషక పదార్థాలతోపాటు అయోడిన్ ఎక్కువగా ఉండటంవల్ల గాయిటర్ అనే వ్యాధిని రాకుండా చూస్తుంది.