కావలసిన పదార్థాలు : గోంగూర.. 2 కట్టలు మినప్పప్పు.. 2 టీ. శనగపప్పు.. 2 టీ. మెంతులు.. కాసిన్ని జీలకర్ర.. ఒక టీ. ఆవాలు.. అర టీ. ఉప్పు.. తగినంత కారం.. రెండు టీ. నూనె.. తగినంత వెల్లుల్లి.. 6 రెబ్బలు ఉల్లిపాయలు.. రెండు ఎండుమిర్చి.. ఆరు కరివేపాకు.. 2 రెమ్మలు ఇంగువ.. చిటికెడు
తయారీ విధానం : గోంగూరను శుభ్రం చేసుకోవాలి. మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిరప, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లిపాయల్ని దోరగా వేయించి పక్కనుంచాలి. అదే బాణలిలో కాస్తంత నూనె వేసి గోంగూరను వేసి సన్నటి మంటపై వేయించాలి. ఆ తర్వాత ముందు వేయించిన పప్పు దినుసులను కూడా వేసి, తగినంత ఉప్పు, కారం కలిపి వేయించాలి.
ఈ మిశ్రమాన్ని మిక్సీలో లేదా రోట్లో వేసి మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి కాగిన తరువాత ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఇంగువ, ఎండుమిరపకాయలతో పోపు పెట్టాలి. ఈ పోపును నూరుకున్న పచ్చడిలో కలిపి వేడి వేడి అన్నానికి నెయ్యి కలుపుకుని తింటుంటే.. ఆ రుచి మాటల్లో చెప్పలేనిది. గోంగూరలో జీర్ణశక్తిని పెంచే గుణాలుండటంతో.. జీర్ణక్రియ సక్రమంగా జరిగి ఆకలిని పెంచుతుంది.