మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » శాకాహారం » క్యాబేజీ చింత చిగురు కూరతో పసందు..! (Vegetarian Food | Cabbage | Tamarind Leaves | Chana Dal | Mustard | Cumin Seeds | Ginger | Garlic)
Feedback Print Bookmark and Share
 
కావలసిన పదార్థాలు :
క్యాబేజీ.. రెండు కప్పులు
చింత చిగురు.. ఒక కప్పు
శనగపప్పు, ఆవాలు, జీలకర్ర.. తలా ఒక్కో టీ.
అల్లం వెల్లుల్లి పేస్ట్.. రెండు టీ.
ధనియాలపొడి.. ఒక టీ.
పసుపు.. అర టీ.
కారం.. ఒక టీ.
గరంమసాలా.. ఒక టీ.
ఎండుమిర్చి.. నాలుగు
ఉల్లిపాయలు.. రెండు
పచ్చిమిర్చి.. నాలుగు
ఉప్పు.. తగినంత
కొత్తిమీర.. సరిపడా
నూనె.. తగినంత

తయారీ విధానం :
క్యాబేజి, పచ్చిమిర్చి, ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉంచాలి. పాన్‌లో నూనె వేడయ్యాక శెనగపప్పు, ఆవాలు, జీలర్ర వేసి.. కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని వేసి వేయించాలి. తరువాత కొత్తిమీర పేస్ట్, ధనియాలపొడి చల్లి, క్యాబేజీ ముక్కల్ని వేసి పచ్చివాసన పోయే వరకూ వేయించాలి.

తర్వాత ఉప్పు, కారం, జీలకర్ర, గరంమసాలా, పసుపు వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమం కొద్దిగా మగ్గిన తరువాత కొద్దిగా నలగ్గొట్టిన చింత చిగురును కలిపి.. మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. అంతే క్యాబేజీ చింత చిగురు కర్రీ రెడీ..! దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని పైన కొత్తిమిర చల్లి సర్వ్ చేస్తే సరిపోతుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.