మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » శాకాహారం » రుచికి రుచీ.. ఆరోగ్యకరం.. "తోటకూర పులుసు" (Veg | Green Leaves | Onion | Tomato | Green Chilli | Chana Dal | Garlic | Salt)
Feedback Print Bookmark and Share
 
Green Curry
FILE
కావలసిన పదార్థాలు :
తోటకూర.. రెండు కట్టలు
ఉల్లిపాయలు.. నాలుగు
టమోటాలు.. నాలుగు
పచ్చిమిర్చి.. ఆరు
తాలింపుగింజలు.. మూడు టీ.
పచ్చిశెనగపప్పు.. 50 గ్రా.
వెల్లుల్లి.. 4 రేకలు
ఉప్పు.. సరిపడా
కారం.. సరిపడా
చింతపండు.. నిమ్మకాయంత

తయారీ విధానం :
తోటకూరను శుభ్రంగా కడిగి తురుముకోవాలి. ఉల్లి, మిర్చి, టమోటాలను ముక్కలుగా తరుగుకోవాలి. తరిగినవన్నీ ఒక గిన్నెలో వేసి దానిపై శనగపప్పు చల్లి ఉప్పు వేసి ఉడికించాలి. తరువాత ఒక కడాయిలో నూనె పోసి కాగిన తరువాత పోపుపెట్టి ఉడికించిన కూరలో వేయాలి. దాంట్లో చిక్కగా కలుపుకున్న చింతపండు రసం పోసి ఉప్పు, కారం, పసుపు వేసి బాగా ఉడకనిచ్చి, దింపేముందు కొత్తిమీర చల్లాలి. అంతే తోటకూర పులుసు సిద్ధం..!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.